నెల్లూరు జిల్లా : మర్రిపాడు మండలం,చుంచులూరు గ్రామంలో శ్రీ అంకమ్మ మల్లెం కొండేశ్వర స్వామి దేవస్థానం నిర్మించి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నవగ్రహ పూజ,గణపతి హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.రేపు పొంగళ్ళ కార్యక్రమం,సామూహిక విందు భోజన కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొని అంకమ్మ మరియు మల్లెంకొండేశ్వర స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కోరెం మల్లికార్జున,సాంబయ్య,కొండలరావు,ఇంద్ర మధు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.