ఆఫీసులో ఫీమేల్ కొలిగ్‌ను ఉద్దేశించి.. బ్యూటిఫుల్ ఫిగర్ అని కామెంట్ చేస్తే ఇకపై వాసిపోతుంది. అవును ఆ మాట అశ్లీల పదజాలం కిందకి వస్తుందని ముంబై సెషన్స్ కోర్టు పేర్కొంది. అంతేకాదు.. బాగా మెయింటైన్ చేస్తున్నావ్, బయటకువ వెళ్దాం వస్తావా వంటి మాటలు ఆ కోవలోకే వస్తాయని స్పష్టం చేసింది. ఇలాంటి పదాలు మహిళలకు ఇబ్బందిని కలిగిస్తాయని.. వారి గౌవరవానికి భంగం కలిగిస్తాయని పేర్కొంది. ఈ తరహా కామెంట్స్ చేస్తే.. ముందుస్తు బెయిల్ కూడా రదని.. పోలీసులు కష్టడీలోనే విచారణ ఎదుర్కొవాల్సి వస్తుందని తెలిపింది. ఇందుకు సంబంధించి న్యాయమూర్తి జడ్జి ఎ.జడ్.ఖాన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఓ రియల్టీ సంస్థలో.. ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్‌గా వర్క్ చేస్తున్న మహిళ పట్ల అసిస్టెంట్ మేనేజర్(42), సేల్స్ మేనేజర్(30) ఇలాంటి వ్యాఖ్యలు ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో వారు ముందుగానే బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే జడ్జి వారి అభ్యర్థనను తిరస్కరించారు. ‘‘ఈ కేసులో విభిన్న కోణాలను పరిశీలించాల్సి ఉంది. నిందితులను కస్టడీలోనే విచారించాలి. లేకుంటే దర్యాప్తు అధికారికి ఉండే విచారించే హక్కును లాగేసుకున్నట్టు అవుతుంది. ఫైనల్‌గా అది ప్రాసిక్యూషన్‌పై ఎఫెక్ట్ చూపుతుంది’’అని పేర్కొన్నారు. వర్క్ ప్లేసులో ఫీమేల్ ఎంప్లాయిస్‌ను వేధించడం తీవ్రమైన విషయమన్నారు…!!