- తెలంగాణ పండుగలకు సెలవులు ఉండవు
- ఆదివారం సెలవు దినం ఉండదు
- పని వత్తిడి పెంచడం వలన కార్మికులు మానిసిక వేదనకు లోనవుతున్నారు
- పబ్లిక్ హాలిడే ని తుంగలో తొక్కుతున్న ఆంధ్రా వ్యాపార సంస్థలు .. పట్టించుకోని తెలంగాణ కార్మిక శాఖ
- ఓటు హక్కు ను వినియోగించుకోకుండా తెలంగాణ బిడ్డల పై పని వత్తిడి .. పట్టించుకోని కార్మిక శాఖ
హైదరాబాద్ : బిసినెస్ హబ్ గ ఉన్న హైదరాబాద్ నగరంలో ఎందరో వ్యాపారవేత్తలు హైద్రాబాదు లో వ్యాపారాలు చేసుకుంటున్నారు. బంజారాహిల్స్ , జూబిలీహిల్స్ లో ఉన్న కొన్ని వ్యాపార సంస్థలు పబ్లిక్ హాలిడే ని తుంగలో తొక్కుతున్నారు. తెలంగాణాలో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన ఎన్నికల రోజు కూడా పని దినం గా ప్రకటిస్తూ కార్మికుల పై పని వత్తిడిని పెంచడమే కాక , తెలంగాణ బిడ్డలు ఓటు హక్కును వినియోగించుకోకుండా చేస్తున్నారు. అంతేకాక పండగ సెలవులవులను కూడా వారికి ప్రకటించకుండా కార్మికుల మానసిక వత్తిడికి కారణమవుతున్నారు . తెలంగాణ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోకుండా తెలంగాణ ప్రజల పై పని వత్తిడి పెంచిన సంస్థలు గుర్తించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ కార్మికులు కోరుతున్నారు