పల్నాడుజిల్లా నర్సరావుపేట పార్లమెంట్ స్థానానికి తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా గురువారం ఉదయం 11 .20 గంటలకు నామినేషన్ వేసిన లావు శ్రీకృష్ణ దేవరాయలు.జిల్లా ఎన్నికల అధికారి, పార్లమెంటు రిటర్నింగ్ అధికారి లోతేటి శివశంకర్ కి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేసిన లావు శ్రీకృష్ణ దేవరాయలు. ఎన్నికల సిబ్బంది నామినేషన్ను క్షుణ్ణంగా పరిశీలించిన పిదప నామినేషన్ స్వీకరించిన రిటర్నింగ్ అధికారి. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా నలుమూలల నుండి తరలి వచ్చిన అశేష జనవాహిని మద్య ర్యాలీ గా బయలుదేరిన లావు శ్రీకృష్ణ. ఈ సందర్భంగా నరసరావుపేట పట్టణము అంతా పసుపు జన సమూహంతో నిండిపోయింది.