నరసరావుపేట, పల్నాడు జిల్లా: నరసరావుపేట పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ J.V. సంతోష్ (అడ్మిన్) ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి 67 ఫిర్యాదులు అందగా, వీటిలో కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు ప్రధానంగా ఉన్నాయి.
అడిషనల్ ఎస్పీ సంతోష్ మాట్లాడుతూ, “ప్రజల ఫిర్యాదులను మొదటి ప్రాధాన్యతతో త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించాలి” అని చెప్పారు.
కొన్ని ప్రధాన ఫిర్యాదులు:
- గోరంట్ల వెంకటేశ్వర్లు ఫిర్యాదు: తన కుమారుల మధ్య ఆస్తి పంచుకోవడంలో పెద్ద కుమారుడు అడ్డుపడుతున్నాడని తెలిపారు.
- షేక్ మౌలాలి ఫిర్యాదు: తన పిల్లల ఉద్యోగానికి సంబంధించి మోసగాడు డబ్బులు వసూలు చేసినట్లు తెలియజేశారు.
- జామియా మసీదు మోసంపట్ల ఫిర్యాదు: మసీదు పునర్నిర్మాణానికి సంబంధించిన చందాలు సేకరించి, ఎటువంటి కట్టడం జరగకపోవడంతో బాధితులు చట్టపరమైన చర్యలు కోరారు.
- మండలానికి చెందిన ముండ్రు శివప్రసాద్ ఫిర్యాదు: లోన్ అప్రూవల్ కోసం డబ్బులు మోసపూరితంగా తీసుకున్నారని చెప్పారు.
- చంద్ర రవీంద్రబాబు ఫిర్యాదు: 89 సెంట్లు మరియు 5 ఎకరాల పొలాన్ని మోసపూరితంగా గడుపుకున్నారని వెల్లడించారు.
- మానుకొండ శ్రీకాంత్ రెడ్డి ఫిర్యాదు: అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా చేయడానికి మోసానికి గురయ్యారని తెలిపారు.
కార్యక్రమం విశేషాలు ..
ఈ కార్యక్రమంలో పలనాడులోని వివిధ గ్రామాల నుండి ప్రజలు తమ సమస్యలను వివరించారు. పోలీస్ సిబ్బంది ఫిర్యాదులను రాసేందుకు సహాయంగా వ్యవహరించారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకు దాతలు అన్నదానం ఏర్పాటు చేశారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం, ప్రజలకు న్యాయ పరిష్కారం అందించటానికి సమర్థమైన వేదికగా నిలిచింది. జిల్లా పోలీస్ కార్యాలయానికి అందిన ఫిర్యాదులపై తదుపరి చర్యలు చేపట్టనున్నట్టు అధికారుల ద్వారా తెలియజేయబడింది.