పల్నాడు జిల్లా, నరసరావుపేట లో విషాద ఘటన చోటు చేసుకుంది. నరసరావుపేట భావన కాలేజీలో ఇంటర్ ఫస్ట్‌ఇయర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అనూష అనే విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. హుటాహుటిన నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.