పల్నాడు జిల్లా నరసరావుపేట : డబ్బులివ్వకుంటే చంపుతామని బెదిరించిన నేరాభియోగం పై నరసరావుపేట మాజీ వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సహా ఎదుగ్గురుపై నరసరావుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలం లోని పామిడిపాడుకు చెందిన కొల్లా సాంబశివరావు అర్వపల్లి గ్రామ సమీపంలో 6 . 10 ఎకరాల భూమి కొన్నారు. ఈ భూమికి సంబంధించిన వివాదం అప్పటి వైకాపా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు చొరవతో సమస్య పరిష్కరించబడింది. అయితే ఈ వివాదాన్ని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అయన అనుచరులు కలసి సాంబశివరావును 16 ఇవ్వాలని వత్తిడి చేసారు. సాంబశివరావు ఇవ్వలేనని చెప్పగా అతనిని కొట్టి గాయపరిచారు. డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారు. 2023 డిసెంబర్ 2 వ తేదీన సాంబశివరావు అప్పటి సియం జగన్ మోహన్ రెడ్డి ని కలవడానికి వెళ్ళితే పోలీసులు అడ్డుకోవడంతో అతని కుటుంబంతో ఆత్మహత్య యత్నానికి పాలుపడ్డారు. అయితే కలవాల్సిన సియం కలవకపోగా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు కారులో ఎక్కించుకుని, కర్రలు రాడ్డులతో కొట్టి బెదిరించారని రివాల్వర్ తో బెదిరించారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైసిపి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తో పాటు రవి కిశోరె రెడ్డి, గాడిపర్తి దయాసాగర్, ప్రసాద్, శ్రీనివాస రావు, షైక్ పొదిలే మదార్ సైదా, కోటిరెడ్డిల పై పోలీసులు కేసు నమోదు చేసారు, ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.