కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే పల్లెల అభివృద్ధికి బాటలు వేస్తూ వాటికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తుందని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రొంపిచర్ల మండలంలో వడ్లమూడివారిపాలెం, విప్పరపల్లి,ముత్తనపల్లి,ఇంద్రగిరి,రైతునగర్ గ్రామాల్లో నిర్మించనున్న సిమెంట్ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే డా౹౹చదలవాడ మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఐదేళ్లూ పల్లెలన్నీ అంధకారంలో మగ్గాయన్నారు. స్థానిక సంస్థలను వైసీపీ అధ్యక్షుడు జగన్‌రెడ్డి నిర్వీర్యం చేశారన్నారు. వైసీపీ నిరంకుశ పాలనలో నిధులన్నీ పక్కదారి పట్టాయన్నారు. పల్లెల అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులను దారిమళ్లించి దుర్వినియోగం చేశారన్నారు. ఈ కారణంగా పల్లెలలో కనీస సౌకర్యాల అమలుకు నోచుకోలేదన్నారు.పంచాయతీలలో సర్పంచులు, పాలకవర్గం ఉత్సవ విగ్రహాలుగా మారారన్నారు. ఎన్నికల సమయంలో హామీ మేరకు మౌలిక వసతులు కల్పనలో భాగంగా రోడ్లు,డ్రైన్లు, తాగునీటికి ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. గ్రామాల సుస్థిర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను రచిస్తూ దశలవారీగా గ్రామాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.అన్నదాతలకు సాగునీటి ఇబ్బందులు లేకుండా పంట కాలువల ఆధునీకరణ, వరద కాలువల మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజలతో మట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. గ్రామాల్లో నీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని, పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రొంపిచర్ల ఎమ్మార్వో, మరియు పులుకూరి జగ్గయ్య, గడిపార్తి సురేష్ . పల్లెల నాగిరెడ్డి,శాఖమూరి రామూర్తి, మెట్టు వెంకటేశ్వరరెడ్డి, చిరుమామిళ్ల బ్రహ్మయ్య,కుంపటి రవి, పెద్ద వెంకటేశ్వర్లు,ఆడుసుమల్లి అప్పారావు,జల్లపల్లి శేషమ్మ,బోయపాటి వాసు,శివరామయ్య, అనంతరమ్మయ్య, మండలం కూటమి నేతలు కార్యకర్తలు మహిళలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.