నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఒకేసారి ఈ కార్యక్రమాన్ని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సభ్యత్వ నమోదులో భాగంగా టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యే చేతుల మీదుగా సభ్యత్వాన్ని తీసుకున్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండాలని సభ్యత్వాన్ని ప్రారంభిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, రొంపిచర్ల మండలం పార్టీ అధ్యక్షులు పులుకూరి జగ్గయ్య, రొంపిచర్ల మండలం పార్టీ సీనియర్ నాయకులు శాఖమూరి రామూర్తి లక్ష రూపాయలు చొప్పున కట్టి శాశ్వత సభ్యత్వం పొందారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు