నరసరావుపేట: నరసరావుపేట SRKT కాలనీలో రూరల్ పోలీస్ అధికారులు నిన్న రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రజలతో మమేకమై మాట్లాడారు. ప్రజలలో ఉన్న అనేక సమస్యలను పరిగణలోకి తీసుకుని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
ఈ తనిఖీలలో భాగంగా, పోలీస్ విభాగం 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటామని, ప్రత్యేకంగా, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్న పోలీసు అధికారులకు తెలియజేయాలని కోరారు
ఈ కార్యక్రమం ద్వారా ప్రజలతో పోలీసులకు సాన్నిహిత్యాన్ని పెంచడం మరియు భద్రతను సమీక్షించడం ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.