contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

‘స్కై క్రూయిజ్’ … ప్రపంచమంతా తిరుగుతూ ఎంజాయ్​ చేయొచ్చు!

క్రూయిజ్ షిప్ తరహాలో వందల క్యాబిన్లు.. అందులోనే సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, గేమింగ్ జోన్లు, షాపింగ్ సౌకర్యాలు.. అద్దాలతో కూడిన బాల్కనీలు.. అబ్బో అనిపించేలా సౌకర్యాలు.. మరి ఇవన్నీ ఉండేది ఓ విమానంలో అయితే.. భలే చిత్రంగా ఉంది కదా. యెమెన్ కు చెందిన ప్రమేఖ సైన్స్ ఇంజనీర్ హషీమ్ అల్ ఘాయిలీ దీనిని డిజైన్ చేశారు. దీనికి సంబంధించి ఓ గ్రాఫిక్స్ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడా వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పెద్ద సంఖ్యలో షేర్లు, లైక్లు వస్తున్నాయి.

Sky Cruise: Arab-designed flying hotel that never lands goes viral |  Esquire Middle East

పేరు ‘స్కై క్రూయిజ్’
విమానంలా గాల్లో ఎగురుతూనే.. అత్యంత విలాస వంతమైన క్రూయిజ్ షిప్ లలో ఉండే సకల సౌకర్యాలను అందించే ఈ సరికొత్త హోటల్ కు ‘స్కై క్రూయిజ్‌’ అని పేరు పెట్టారు. ఏక కాలంలో ఐదు వేల మంది ప్రయాణించడానికి వీలుగా ఉండటంతో దీన్ని ‘బాహుబలి’ హోటల్ గా అభివర్ణిస్తున్నారు. అంతేకాదు ఈ విమానం ఆకాశంలో ఏళ్ల తరబడి నిరంతరాయంగా ఎగరగలుగుతుందని డిజైనర్ చెప్తున్నారు.

ఇందుకోసం అణు ఇంధనంతో నడిచే 20 ప్రత్యేక ఇంజన్లను వినియోగించాల్సి ఉంటుందని.. చిన్నపాటి అణు రియాక్టర్‌ ను వినియోగిస్తే సరిపోతుందని అంటున్నారు. ప్రయాణికులు, సరుకులను చిన్న విమానాల ద్వారా ఈ భారీ విమానంలోకి చేరుస్తారట. ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ప్రయోజనం ఉండేలా ఓ ఆస్పత్రి కూడా ఉంటుందని చెప్తున్నారు.

Inside giant flying luxury hotel that can stay in the air for years

ఈ విమానంలో భారీ షాపింగ్‌ మాల్‌, రెస్టారెంట్లు, ప్లేగ్రౌండ్లు, బార్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌ పూల్ వంటివి ఉంటాయని డిజైనర్ చెప్పారు. ఇక విమానం తోక భాగంలో ఉండే భారీ డెక్‌ నుంచి 360 డిగ్రీల కోణంలో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వీక్షించవచ్చని వివరించారు. విమానం మధ్య లోపలికి వెలుతురు ప్రసరించేలా అద్దాలను అమర్చనున్నారు.

https://youtu.be/VHNrdTSr2G4

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :