మునుగోడు మర్రిగూడ మండలం శివన్న గూడంలో టిఆర్ఎస్ పార్టీలో భగ్గుమన్న విభేదాలు, టిఆర్ఎస్ పార్టీ కార్యాలయనికి సొంత పార్టీ నేతలు తాళం వేసిన ఘటన . స్థానిక నేతలను కాదని దేవర్ కద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తన ఇష్టానుసారంగా హైదరాబాద్ లో వుండే వలస నేతలతో కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారని నిరశిస్తూ శివన్న గుడం మాజీ సర్పంచ్ సురేందర్ రెడ్డి, అతని అనుచరులు సొంత టిఆర్ఎస్ పార్టీ కార్యాలయనికి తాళం వేయడం రిపోర్టర్ టివి ప్రత్యేక బృదం ఇచ్చిన సమాచారం మేరకు జరిగిన సంఘటనను వెలుగులోకి తేవడం జరిగింది. ఈ విషయం స్థానిక నాయకులే కాక రాష్ట్ర నాయకుల వరకు చేరడం తో స్పందించారు. హుటాహుటిన బయలుదేరిన దేవర్ కద్ర ఎమ్మెల్యే శివన్న గూడం కు చేరుకొని పార్టీ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. మాజీ సర్పంచ్ సురేందర్ రెడ్డి ఎమ్మెల్యే ని కలవడానికి నిరాకరించడం తెరాస నాయకుల గుండెల్లో దుమారం రేపోతోంది. ఇంకా పూర్తి వివరాలతో మీ ముందుకొస్తాం … రిపోర్టర్ టివి ని ఫాలో అవ్వండి.