అల్లూరి జిల్లా,రాజవమ్మంగి,ది రిపోర్టర్ : రాజవమ్మంగి గ్రామంలో కొంతమందికి అర్హతలున్నా దక్కని వృద్ధాప్య పెన్షన్. వివరాల్లోకి వెళితే అల్లూరి జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, రాజవొమ్మంగిలో వెలుగులోకి వచ్చిన పెన్షన్ వ్యవహారం. పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టంగా అమలు చేసిన అధికారుల నిర్లక్ష్యం వలన పథకాలు ప్రజల వద్దకు చేరడం లేదని స్థానిక నివాసి నంబారి అప్పారావు (72)గత 12 సంవత్సరాలుగా పంచాయతీ కార్యాలయం, ఎంపిడిఓ కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు, పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.