- వైసీపీలో దళితులకు సముచిత స్థానం లేదు
- దళితులపై జగన్ కు ఉండేది.. సవతి ప్రేమ
- ఎస్సిల ద్రోహి మాజీ సీఎం జగన్ రెడ్డి
- ఎస్సీల మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తి జగన్
- ఆరోగ్యశ్రీ పథకాన్ని కమీషన్లతో దోపిడీ
- వైసిపి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ అశోక్‌బాబు, జట్పీటీసీ సభ్యురాలు రత్నభారతి.
ప్రకాశం జిల్లా / ఒంగోలు : వైసీపీలో దళితులకు, పేదలకు స్థానం లేదని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ యాదాల అశోక్‌బాబు ఆరోపించారు. దళితుల మనోభావాలను అర్థం చేసుకోలేని వ్యక్తి పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అని విమర్శించారు. ఒంగోలు తన కార్యాలయంలో సోమవారం తన సతీమణి, నాగులుప్పలపాడు జడ్పీటీసీ డాక్టర్ రత్న భారతితో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు.
వైసీపీలో సంతోషం గా దళితులు లేరన్నారు. తనకు పదవి ఇచ్చారే త ప్ప తన వెనుక షాడోలను ఏర్పాటు చేసి వారే హా స్పటల్స్‌కు వెళ్ళేవారన్నారు. అప్పటి మంత్రి విడ దల రజని, ఐఏఎస్ అధికారులు కిషోర్‌బాబు, ధ నుంజయరెడ్డి, శివారెడ్డి, అప్పటి ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణారెడ్డిలు తనను అడ్డుకు న్నారని విమర్శించారు. వైద్యశాలల నుంచి వచ్చిన కమీషన్లను వారే దోచుకున్నారని ఆరోపించారు.
సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను చెప్పేందుకు వైవీ.సుబ్బారెడ్డి వద్దకు వెళ్ళినా, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చెప్పినా వారికే ఇబ్బందని, ఇలా ఎవరికీ సమస్యలు చెప్పుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. తన సతీమణి నాగులుప్పలపాడు జడ్పీటీసీగా ఉన్నా వివక్షత చూపుతూ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారన్నారు. అందువల్లనే తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, అలాంటి పార్టీలో ఉండటం కంటే వీడటం మంచిదని నిర్ణయం తీసు కున్నట్లు అశోక్‌బాబు, రత్నభారతి వివరించారు.