మాజీ మంత్రి బాల్నేని శ్రీనివాస్ రెడ్డి ఇటీవల వైసీపీని వీడి జనసేన పార్టీలోకి చేరిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో అధినేత జగన్మోహన్ రెడ్డి ఆలోచించి జిల్లాలో పార్టీని పటిష్టమైన నాయకత్వంతో నడపగల సమర్థవంతమైన వ్యక్తి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అని భావించి జిల్లా పార్టీ పగ్గాలు అతనికి అందించడం జరిగింది.
ఈరోజు ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు వైయస్సార్సీపి కార్యాలయంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా అధ్యక్షునిగా బాధ్యతా స్వీకరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. బైక్ ర్యాలీ మరియు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బూచేపల్లి మాట్లాడుతూ తన రాజకీయ జీవితం వైయస్ కుటుంబంతోనే తన ప్రయాణమని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని సమస్యలు వచ్చినా జగన్ వెంటే నడుస్తానని, తాను నమ్ముకున్న కార్యకర్తలకు అండదండగా ఉంటానని, తన కర్తవ్యం 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని విజయం దిశగా నడిపించి, మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవటమేనని, తనకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య (నాని) మాట్లాడుతూ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా పార్టీని నడిపించడంలో సమర్థుడని, బూచేపల్లి కుటుంబం నిత్యం ప్రజలలో ఉండే కుటుంబమని, బూచేపల్లి కుటుంబానికి తనకు ఉన్న సానిత్యం గురించి వివరించారు.
గడిచిన వందరోజుల పాలనలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదంటూ, ప్రజలను మభ్య పెట్టే విధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తున్నారంటూ, వైఎస్ఆర్సిపి లో గ్రామస్థాయిలో కలిసికట్టుగా పనిచేయాలంటూ, గ్రామస్థాయి ,మండల స్థాయిలో వర్గ పోరు తగదంటూ కార్యకర్తలకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వారితోపాటు జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రులు ఆదిమల సురేష్, మెరుగు నాగార్జున, జూపూడి ప్రభాకర్, చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ కరణం వెంకటేష్, మార్కాపురం నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ అన్నా రాంబాబు, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, కనిగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ దద్దాల నారాయణ, రాష్ట్ర ఆర్యవైశ్య చైర్మన్ కుప్పం ప్రసాద్, జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.