ప్రకాశం జిల్లా, ఒంగోలు: సంతనూతలపాడు మాజీ శాసనసభ్యులు పాలపర్తి డేవిడ్రాజు నిన్న ఆదివారం హైదరాబాదు లోని అపోలో ఆసుపత్రి లో అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతూ మరణించారు. సంతల నూతలపాడు శాసనసభ్యులు బి ఎన్ విజయ్ కుమార్ ఒంగోలు క్లౌ పేటలోని పాలపర్తి డేవిడ్రాజు స్వగృహం వద్ద వారి యొక్క భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ ఎమ్మెల్యే బాచిన గరటయ్య, సంత నూతలపాడు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
