కేంద్రం తెచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు నేటి నుంచి అమలు కానున్నాయి. ఈ కొత్త చట్టాల ప్రకారం కొన్ని కేసుల్లో శిక్షలు కఠినం అవుతాయి.
చిన్నారులపై సామూహిక అత్యాచారం చేసిన వారికి మరణ శిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడనుంది. ఈ కొత్త చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన 45 రోజుల్లోగా కచ్చితంగా తీర్పు వెలువడాలి. తొలి విచారణ జరిగిన 60 రోజుల్లోపు అభియోగాలు నమోదు చేయాలి.