పల్నాడు జిల్లా/ పెదకూరపాడు: ఆర్గానిక్ సాగుకు జీవామృతం ముఖ్యమని జీవశాస్త్ర ఉపాద్యాయులు యక్కంటి విజయ భాస్కర్ రెడ్డి తెలిపారు. మంగళవారం పెదకూరపాడు మండలం 75త్యాల్లూరు జడ్పీ హైస్కూల్ లో జీవామృతం తయారీ,వాడే విధానంపై విద్యార్థులకు అవగాహన నిర్వహించారు.
జీవామృతం తయారీకి:
పది కిలోల ఆవు పేడ, పది లీటర్ల ఆవు మూత్రం,,రెండు కిలోల శనగపిండి,,రెండుకిలోల బెల్లం,,ఒక కిలో మట్టి ,,200 లీటర్ల నీరు కలిపి బాగా కలియ తిప్పాలని తెలిపారు. ఈ విధానాన్ని విద్యార్థులచే చేయించి అవగాహన కల్పించారు.
ప్రతిరోజూ ఉదయం,సాయంత్రం రెండుసార్లు కలియతిప్పాలని,ఈవిధంగా ఐదు,ఆరు రోజులు చేశాక జీవామృతం వాడకానికి తయారు అయినట్టు తెలిపారు.
మొక్కలకు భూమిలో అందించడం ద్వారా పోషకాలు అందుతాయని ,,పైరు పైన పిచికారీ వల్ల క్రిమి సంహారకం జరిగి మొక్కలు బాగా ఎదుగుతాయని తెలిపారు.
ఈ విధానం వల్ల పురుగుమందుల అవశేషాలు లేకుండా ప్రకృతి పద్దతిలో పంటలు పండించడం ఆరోగ్యదాయకం అని వారు తెలిపారు.
జీవామృతం ఉపయోగించి పాఠశాలలో ఆకుకూరలు,,కాయ కూరలు పండిస్తున్నట్లు HM అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంఘీకశాస్త్ర ఉపాద్యాయులు రమేష్,కోటేశ్వరరావు,పిడి అరుణశ్రీ, బాలకృష్ణరెడ్డి, పిసి చైర్మన్ గంటా పున్నారావు, విద్యార్థులు పాల్గొన్నారు.