contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హుకుంపేటలో ఒరిస్సా మద్యం అమ్మకాలు … పట్టించుకోని అధికారులు

  • పాడేరు అమ్మవారి జాతర నిమిత్తం మద్యం అమ్మకాలు నిషేధించిన కలక్టర్ సుమిత్ కుమార్
  • హుకుంపేటలో ఒరిస్సా మద్యం అమ్మకాలు.
  • చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు
  • గిరిజనులను మభ్యపెట్టి అధిక ధరలకు విక్రయిస్తున్న మద్యం మాఫియా

అల్లూరిజిల్లా, హుకుంపేట: అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం పాడేరు అమ్మవారి జాతర విజయవంతంగా నిర్వహించాలనీ,ఎటువంటి గొడవలు, అసాంఘిక కార్యక్రమాలు తలెత్తకుండా వుండాలంటే జాతర నిమిత్తం మద్యం నిషేధం చేపడితే సగం క్రైమ్ కట్టడి చేయవచ్చనే ఉద్దేశంతో అల్లూరి జిల్లా కలక్టర్ సుమిత్ కుమార్ మంచి ఆలోచనతో జాతర నిమిత్తం జాతర ముందు రోజు నుండి 5 రోజులు పాడేరు మరియు హుకుంపేట మద్యం షాపులు మూసివేయడం జరిగింది. జాతరకు వచ్చిన వారిలో కొంతమంది తప్పనిసరిగా మద్యం సేవించి విలాశాలు చేస్తారు.మద్యం మత్తుకు బానిసలైన వారికి మద్యం వుండాలి.దీనిపై దృష్టి సారించిన కొంతమంది మద్యం షాపులు మూసివేయడం వలన మందు ఎక్కడ దొరకదనే ఆలోచనతో ముందుగానే బాక్సులతో మద్యం కొనుగోలు చేసి నేడు బ్లాక్ మార్కెటులో అధిక ధరకు ఎంతలా అంటే ప్రభుత్వం విక్రయించే బాటిల్ ధరకు మూడింతలు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే పాడేరు మరియు హుకుంపేట నుండి ఒరిస్సా దగ్గర కావడంతో ఒరిస్సా నుండి మద్యం తెచ్చి విక్రయిస్తున్నారు,
ఇది వాస్తవమా కాదా అనేది పైన వున్న మద్యం ఫోటోలు చూస్తే కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది.ఈ మద్యం బ్లాక్ మార్కెట్ కోసం పలువురు మాట్లాడుతూ… నిజంగా మద్యం మాఫియా విచ్చలవిడిగా అమ్మడం అధిక ధరలు పెంచి ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు అనేది అధికారులు గుర్తించాలన్న, బ్లాక్ మార్కెట్ విక్రయాలు తెలియాలంటే ఒక సారి పై ఫోటోలో కనిపిస్తున్న కింగ్ ఫిషర్ బీరు మన మన్యంలో గల ఏ మద్యం షాపులోని దొరకదు మరీ నేడు అమ్ముతున్నారంటే దీని వెనుక ఆంతర్యం ఏమిటనేది అర్థం కావట్లేదని దీనికి తోడు ఒరిస్సాలో మద్యం చాలా తక్కువ ధరకు వస్తుంది కనుక అక్కడ నుండి తెచ్చి అమ్ముతున్నారు, అలాగే ఈ మద్యం క్వాలిటీలో కూడా తేడా వుంటుంది గతంలో కొంతమంది ఈ మద్యం సేవించి అస్వస్థతకు గురైన ఘటనలు కూడా వున్నాయి.ప్రభుత్వం బెల్ట్ షాపులే కనిపించ కూడదని నేరుగా రాష్ట్ర అధికార ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం ప్రజలు, అధికార యంత్రాంగానికి కూడా తెలుసు నేడు ఈ మద్యం మాఫియా అధికారుల ఆదేశాలు కూడా భేఖాతరు చేస్తూ అక్రమ మద్యం అమ్మకాలు చేస్తున్నారు అనేది అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది, కానీ సంబంధిత అధికారులకు కనిపించక పోవడం విడ్డూరంగా వుందని పలువురు ఆరోపిస్తున్నారు,అలాగే కొంతమంది వ్యక్తులు మన రాష్ట్ర మద్యం అమ్ముతు న్నావారు మూడు ( 3 ) రోజులకు సరిపోయే మద్యం నిల్వ చేసుకున్నారు.మనం మద్యం షాపుకు వెళ్తే మనిషికి రెండు బాటిల్స్ మాత్రమే ఇస్తారు కానీ నేడు రోజులకు సరిపోయే మద్యం నిల్వ చేసి అమ్ముతున్నారు.
మద్యం అక్రమ వ్యాపారం విచ్చలవిడిగా కనిపిస్తుంది కనుక ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టి సారించి ఈ అక్రమ మద్యం అమ్మకాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకుంటారా? లేదా?అనేది ప్రశ్నార్థకంగా మారింది,ఈ కధనం పై చర్యలు తీసుకుంటారా? లేక జాప్యం చేస్తారా? అనేది అందరూ వేచి చూడాల్సిందే.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :