- పాడేరు ప్రభుత్వ జిల్లాఆసుపత్రిలో శవ రాజకీయం.
- పత్తలేని డియమ్ &హెచ్ ఓ, ఆసుపత్రి సూపరిండెంట్!
- వైద్య అధికార్ల తీరుపై జడ్పీటీసీ గంగరాజు అసంతృప్తి
- ప్రాజెక్టు అధికారి ఫిర్యాదు చేసిన అనంతగిరి జెడ్పిటిసి దిసారిగంగరాజు.
అల్లూరి జిల్లా, అనంతగిరి: వివరాల్లోకి వెళితే!! అనంతగిరి మండలం పినకోట పంచాయతీ చింతపాక గ్రామానికి చెందిన చింత గంగులు 16.2.2024 నాడు ఆటో నుండి జారిపడిగాయాలు కాగా!! వైద్యం కోసం జిల్లా ఆసుపత్రి పాడేరులో చేర్పించారు.!! అయితే చికిత్స పొందుతూఈరోజు (21.2.2024 ) సరైన వైద్యం అందక గంగులు మరణించారు.
దయనీయమైన పరిస్థితి ఏమిటంటే పోస్టుమార్టం చేసిన మృతదేహన్ని
భాధితుల మోఖన్నా పడేసి చోద్యం చూసిన హాస్పిటల్ సిబ్బంది.
ఎన్ని సార్లు విన్నవించిన గాని మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ సర్వీస్ ను కల్పించలేదు. కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం దిక్కుతోచని పరిస్థితుల్లో ఒంట్లో వస్తువులను అమ్ముకొని మృతదేహాన్ని తరలించారు.
అంతకుముందే బాధితులు కన్నీరు పెట్టుకొని అనంతగిరి జెడ్పిటిసితో మాట్లాడగావెంటనే స్పందించిన జడ్పిటిసి ముందుగా డిఎం అండ్ హెచ్ ఓ తో మాట్లాడి! సూపరిండెంట్ గారికి చెప్పి అంబులెన్స్ ఏర్పాటు చేయమని మాట్లాడగా!! ఎటువంటి స్పందన లేకుండా!!ఇదిగో అదిగో అంటూ!! శవ రాజకీయాన్ని నడిపారనీ అసంతృప్తి వ్యక్తం చేశారు, అనంతరం జడ్పీటీసీ గంగరాజు స్పందిస్తూ!! వెంటనే గౌరవ ప్రాజెక్టు అధికారి వారికీ సంబంధిత అధికారులపై ఫిర్యాదు చేయడం జరిగింది.
దింతో జడ్పీటీసీ గంగరాజు పిర్యాదు మేరకు ఐటీడీఏ పిఓ బాధితులు అంబులెన్స్
కొరకు పెట్టిన ఖర్చును ఐటీడీఏ ద్వారా భరిస్తామని ప్రాజెక్ట్ అధికారి వారు భాధితులకు హామీ ఇచ్చారనీ తెలిపారు.
జడ్పీటీసీ గంగరాజు ..