తిరుపతి జిల్లా, పాకాల మండలంలో స్వచ్ఛతహే సేవా కార్యక్రమంలో భాగంగా పాకాల మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మరియు బస్టాండ్ దగ్గర జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి ఆధ్వర్యంలో మానవహారము మరియు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మాట్లాడుతూ పచ్చదనం ముద్దు ప్లాస్టిక్ కవర్ వద్దు ప్లాస్టిక్ వాడకం పై ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా తడి చెత్తను ఎరువుగా మార్చు జగతికి మేరును చేకూర్చు, తడి చెత్త నుంచి ఎరువును చేస్తే ఉండదు కరువు, రోడ్డుపైన చెత్త వెయ్యకు పర్యావరణాన్ని పాడు చేయకు అనే నినాదంతో ప్రజలలో ప్లాస్టిక్ వాడకం పై జరిగే అనర్థాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాకాల ఎంపిడిఓ ప్రభాకర్, తహసీల్దార్ నిత్యానంద బాబు, ఈఓ పి ఆర్ డి మాలతీ, వెలుగు సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది మరియు ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది, పాకాల డిగ్రీ కళాశాల, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.మొహిద్దీన్ భాష, వైన్ ప్రిన్సిపాల్ సురేంద్ర మరియు వారి సిబ్బంది, డిగ్రీ కళాశాల విద్యార్థులు, పుర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనారు.