తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు పాకాల సీఐ మద్దయ్య ఆచారి తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐ గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబడిన సమాచారం మేరకు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు లాండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి మరియు చంద్రగిరి డిఎస్పి బేతపూడి బాబు సూచనల మేరకు పాకాల రైల్వేస్టేషన్లలో తనిఖీలు నిర్వహించామన్నారు. తనిఖీలు నిర్వహించే సమయంలో రైల్వేస్టేషన్లలో ఒక వ్యక్తి ఒక బ్యాగుతో బయటికి రావడం జరిగిందని, పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నం చేయగా వెంటనే చుట్టుముట్టి పట్టుకుని విచారించగా ఆ వ్యక్తి వద్ద నుంచి 6 కేజీల గంజాయితో పట్టుబడ్డాడు అన్నారు. అతని వద్ద నుంచి సుమారు 75 వేల విలువ చేసే 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. విచారించగా తన పేరు శర్వన శంకర అని తన తండ్రి పేరు శంకర అని తను తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా, సియన్ పాలెం నందలి చొక్కా నాధపాలెం నివాసిగా తెలిసిందన్నారు. తాను విశాఖపట్నం నుండి చెన్నైకి గంజాయి తీసుకుని పోతున్నట్లు చెప్పడం జరిగిందని సిఐ తెలిపారు. అందుకు గానూ తాను 15000 లు లీేనా అను వ్యక్తిని వద్దనుండి తీసుకుంటున్నట్లు చెప్పడన్నారు. ఇతని మీద ఇదివరకే తమిళనాడు మండలి కడలూరు జిల్లాలో రెండు గంజాయి కేసులు నమోదైనట్లు సిఐ మద్దయ్య ఆచారి తెలిపారు. దీని మీద కేసు నమోదు చేసే రిమైండ్ కి తరలిస్తున్నట్లు తెలిపారు.