తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు పంచాయతీ లోని మొరవపల్లి,కాకర్లవారిపల్లి గ్రామాలలో ఆదివారం రాత్రి ఏనుగుల గుంపు సంచరించి పంట నష్టం చేశాయి.సోమవారం ఈ సందర్భంగా ఉద్యాన అధికారిణి ఎస్.శైలజ మాట్లాడుతూ మామిడి,కొబ్బరి,అరటి,కాకర తోటల ధ్వంసం చేసి,చెట్ల కొమ్మలని విరచడం,కొబ్బరి సుడులను,అరటి దుంగలను పీకి తినడం,పొలాలను తొక్కడం ద్వారా పంటలను నష్ట పరచడం జరిగిందని పేర్కొన్నారు.నష్టపోయిన రైతు పంట పొలాలను మండల ఉద్యాన అధికారిణి సోమవారం పరిశీలించి,పంట వివరాలను నమోదు చేయడం జరిగిందని తెలిపారు.గ్రామ రైతులు సాయంత్రం ఐదు గంటల తరువాత పొలాలకు అవసరం అయితే తప్ప వెళ్లాలే కాని,అది కూడా ఒంటరిగా వెళ్లకూడదని రైతులకు తెలిపారు.
