- భయపెడుతున్న వైరల్ జ్వరాలు
- వ్యర్థాలతో నిండిన డ్రెయినేజీలు
- వీధుల్లో పేరుకుపోయిన చెత్తకుప్పలు
- విజృంభిస్తున్న దోమలు, ఈగలు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం సామిరెడ్డి పల్లి పంచాయతీ మరియు చెన్నుగారి పల్లి పంచాయతీలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్యాలను కాపాడవలసిన పంచాయతీ అధికారులు ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు.
ఈ పంచాయతీలలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలు, దుర్వాసన, డ్రైనేజీల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్ధాలు, ఇండ్ల మధ్యలో ఉన్న వాటర్ ట్యాంక్ వద్ద అడవని తలపిస్తున్న పొదలు, చెత్తాచెదారంతో విష సర్పాల సంచాంరం ఎక్కువ అవుతుందని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మురుగు కాలువలు పూడిపోయి అధ్వానంగా తయారయ్యి తీవ్రదుర్గంధం వెలువడుతోంది. చుట్టుపక్కల ఉన్న ఇండ్లు వారికి కాలవలో మురుగునీరు నిలవడం వలన దోమలు, ఈగలు విజృంభించడంతో ప్రతి ప్రాంతంలోనూ వైరల్ జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా మరియు విష జ్వరాల కేసులు నమోదవుతున్నాయి. ఖాళీ స్థలాల్లో మురుగునీరు చేరి ఆపరిశుభ్రత చోటు చేసుకుంటోందని దీనివలన అంటువ్యాధులు ప్రభలుతున్నాయని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సామిరెడ్డి పల్లి పంచాయతీలో తోటపల్లి మరియు పాకాల మార్గం గుండ స్థానికులు మరియు బయట ప్రాంతాలకు చెందిన వ్యక్తులు మార్కెట్ కి వెళ్లాలంటే తోటపల్లి మార్గం గుండా వెళ్ళవలసి వస్తుంది. ఈ మార్గం గుండ వెళ్లాలంటే ప్రజలు మరి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ మార్గంలో మూడు నెలల నుంచి డ్రైనేజీ రోడ్లు పైకి వచ్చినా పంచాయతీ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానిక గ్రామస్తులు వాపోతున్నారు. దీంతో దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలుతున్నాయి. పలు గ్రామాల్లో తాగునీరు కలుషితమవుతోంది. దీంతో ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు వ్యాధుల బారిన పడుతున్నారు. పారిశుధ్యాం పైన పంచాయతీ అధికారులు దృష్టి సారించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. పంచాాయతీలో పంచాయితీ కార్యదర్శులు పర్యటించకపోవడంపై ఇలాంటి నిద్ర అవస్థ పాలన కొనసాగుతోందని ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వినబడుతున్నాయి. పారిశుద్ధ్యంపై తక్షణం చర్యలు తీసుకోవాలని పరిసర గ్రామ ప్రజలు కోరుతున్నారు.