తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో బుధవారం వైఎస్ఆర్సిపి మరియు టిడిపి నాయకులు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్నది. వివరాల్లోకి వెళితే శ్రీరామకృష్ణ థియేటర్ యందు పుష్ప-2 సినిమా’కు సపోర్ట్ గా వైఎస్ఆర్సిపి నేతల ఫ్లెక్సీ స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో హీరో బన్నీతో పాటు “2029 సిఎం తాలూకా” అని మాజీ సీఎం జగన్, ఫోటోతోపాటు “మంచి చేసి మోసపోయిన ఎమ్మెల్యే తాలూకా” అని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్లెక్సీ కట్టారు. ఈ విషయంపై స్థానిక టిడిపి నాయకులు వైసీపీ నాయకులకు ఫ్లెక్సీలో ఉన్న విషయం రెచ్చగొట్టే విధంగా ఉందని ఫ్లెక్సీ తియ్యాలని వైసిపి నాయకులను కోరారు. వైసీపీ నాయకులు ఫ్లెక్సీ తియకపోవడంతో టిడిపి నాయకులు ఆ ఫ్లెక్సీ చించారు. దీనికి ఆగ్రహించిన వైఎస్ఆర్సిపి నాయకులు టిడిపి నాయకుల బ్యానర్ చించారు. దీంతో ఇరు వర్గాల మధ్య పరస్పరం ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఘర్షణ నెలకొంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు.
