తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ హెచ్ఎం మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాకాల జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి, ఎస్ఎంసి చైర్మన్ పాతగుంట ముని ప్రభాకర్ హాజరయ్యారు. ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశ కార్యక్రమం ఒక పండగ వేడుకలు తలపించే విధంగా జరిగింది. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సమన్వయంతో పిల్లలపై దృష్టి సారిస్తే వారికి సద్భుద్ది అలవడంతో పాటు ఉన్నత విద్యాభివృద్ధి లభిస్తుందని తెలిపారు. పాఠశాల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఆట పోటీలు నిర్వహించారు. ఆట పోటీల్లో విజేత అయిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఎస్ఎంసి చైర్మన్ పాతగుంట ముని ప్రభాకర్ ద్వారా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కలికిరి నారాయణస్వామి కో ఆప్షన్ నెంబర్ రాజేంద్ర నాయుడు, మందలపు వెంకటాద్రి నాయుడు, ఆర్.వి.ప్రసాద్ విద్యార్థులు పాల్గొన్నారు.