చంద్రగిరి మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాకాల మండలంలో మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దీనిని మానుకోవాలని మైనార్టీ నాయకులు హితువు పలికారు. పాకాల పట్టణంలోని ప్రైవేట్ కల్యాణ మండపంలో ముస్లిం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం పట్టణంలోని రామకృష్ణ థియేటర్ వద్ద రాజకీయ వ్యాఖ్యలతో కూడిన ఫ్లెక్సీ విషయంగా జరిగిన గొడవలో ఇరువర్గాలు గాయపడ్డారని అయితే చెవిరెడ్డి కుటుంబం తమ రాజకీయ లబ్ధి కోసం ముస్లిం మైనారిటీ వర్గాలపై జరిగిన దాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఇది మంచి పద్దతి కాదన్నారు. నిజంగా ముస్లింలపై ప్రేమ ఉంటే తన పార్టీ నాయకుల ధన దాహానికి కరెంట్ షాక్కు బలై మృతదేహం కడచూపుకు కూడా నోచుకోలేకపోయిన కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకొని తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న పది సంవత్సరాలలో ముస్లిం మైనార్టీ నివసించే ప్రాంతాలలో కనీసం తాగునీటి సమస్యనుకూడా పరిష్కరించలేదని విమర్శించారు. కేవలం ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప ముస్లింలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలే అయినప్పటికీ శాసనసభ్యులు పులివర్తి నాని మండలంలోని కరీం తుల్లా బాద్ తాగునీటి సమస్య పరిష్కారం కోసం 25 లక్షల రూపాయల తో పైప్ లైన్ నిర్మాణం ఏర్పాటు చేశారని, ఇరంగారిపల్లి గ్రామపంచాయతీ పకీరు పేటలో ఇంటింటికి త్రాగునీటి పైపులైన్ ఏర్పాటు చేశారన్నారు. దామలచెరువులోని ముస్లింలు నివసించే ప్రాంతాలకి తాగునీటి పై పులైన్ మంజూరు చేశారన్నారు. అయితే పులివర్తి నాని పై తెలుగుదేశం పార్టీపై ముస్లింలలో వ్యతిరేకత రావడానికి బుధవారం జరిగిన గొడవను అవకాశంగా తీసుకుని మతాల మధ్య చిచ్చు పెట్టి ముస్లింలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలనుకోవడం దుర్మార్గమని ఇకనైనా ఇటువంటి పనులు మానుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి, టిడిపి మండల కన్వీనర్
నాగరాజ నాయుడు, ప్రధాన కార్యదర్శి పల్గుణ కుమార్, మైనారిటీ నాయకులు జియావుద్దీన్, లతీఫ్, ఇలియాస్, మహమ్మద్ షరీఫ్, అబ్దుల్ గని, షాజహాన్, ఖాదరపల్లి, మహమ్మద్ రఫీ, హుస్సేన్ తదితరులు పాల్గొన్నా