తిరుపతి : తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం సామిరెడ్డి పల్లి పంచాయతీ పరిధిలోని పెద్ద చెరువు మొరువ సమస్యపై ది రిపోర్టర్ టీవీ కథనం మేరకు ప్రభుత్వ స్పందన లభించింది. 2021 సంవత్సరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా చెరువు కట్ట తెగిపోవడంతో, అప్పటి ప్రభుత్వం జెసిబి యంత్రాలతో మొరువని తొలగించి, నీటిని వృధాగా బయటికి వదిలింది.
అయితే, అప్పటి వరకు పెద్ద చెరువు కట్ట మరమత్తులు చేసినప్పటికీ, మొరవ పనులపై సరైన దృష్టి పెట్టలేదు. దీంతో ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల చెరువు నీళ్లను నిలిపే కట్టలో కొంత మేరకు నీళ్లు చేరడంతో, స్థానిక ప్రజలు ఆందోళన చెందారు.
సమస్యపై స్పందించిన ఆధికారులు వెంటనే మొరువ పనులను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ నిధులు కొంత మేరకు విడుదల అయినప్పటికీ, గ్రామస్తులు కూడా ఈ పనులకు తోడ్పడేందుకు ముందుకు వచ్చారు. గ్రామస్తులు, స్థానిక నేతల సహకారంతో చందాలు వేసి, మొరవ నిర్మాణం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో సామిరెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ జగన్నాథ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు భువనేశ్వర్ రెడ్డి, అర్జున్ రెడ్డి, కమతంపల్లి బోయపాటి వెంకటాద్రి నాయుడు మరియు ఇతర గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
పాకాల చెరువు మొరవ పరిస్థితి ఇంతేనా ? .. కూటమి ప్రభుత్వమైనా పట్టించుకుంటుందా !