తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో లైన్స్ క్లబ్ పాకాల ప్యాట్నీ ఆధ్వర్యంలో సోమవారం ప్రిన్సిపాల్ బేబీస్ రెడ్డి అధ్యక్షాతన దాత లైన్ కుప్పు స్వామినాయుడు కుమారుడు భరత్ కుమార్ సహకారంతో ప్రతి గ్రూపు నందు ప్రథమ ద్వితీయ స్థానాలలో అధిక మార్కులు పొందిన 13 మంది విద్యార్థులకు పదివేల రూపాయలు చొప్పున అందజేశారు. విద్యార్థులు జె. వెన్నెల ఎంపీసీ, ఎం బేబీ బైపీసీ, కే భావన బైపిసి, ఏనవ్య సి ఇ సి, వి భవ్య హెచ్ ఇ సి, కే పురందేశ్వరి బి అండ్ ఆర్ ఎం, వి జాహ్నవి సిఎస్సి వారికి మొదటి బహుమతి, టీ జోత్స్న కే మనీషా బైపిసి, ఎన్నం అఖిల, ఆర్ యమునా హెచ్సి, జి కన్నమ్మ బి ఎన్ ఆర్ ఎం, ఎం ఏంజెల్ సిఎస్సి వారికి రెండవ బహుమతిగా బహుగురించడం అయినది . ఈ కార్యక్రమంలో దాత భరత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు శ్రవణంలో అభివృద్ధి సాధించాలని ఉన్నత స్థానంలో ఉన్న సి ఓ లను ప్రముఖులను ఆదర్శం తెలిపారు. పాకాల ప్లాటినం లైన్స్ క్లబ్ అధ్యక్షులు తులసిరాం మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా విద్యాభివృద్ధికి వీలైనంత సేవలు చేస్తూ పాకాల లైన్స్ క్లబ్ ప్రముఖంగా ఉందని దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సభకు తెలియజేశారు! లైన్ డిసి రామయ్య మాట్లాడుతూ దేశ జనాభాలో సగం ఉన్న మహిళలు అన్ని రంగంలో తమ వాటాలను పొందాలని ముఖ్యంగా పాలనాపరంగా అసెంబ్లీ పార్లమెంటులో స్త్రీలు సగం ఉండి మహిళలు అన్నిరంగంలో తమ వాటాల పొందాలని తమ హక్కులను కాపాడుకోవాలని సమ సమాజం నిర్మించాలని కోరారు. భవిష్యత్తులో క్రమశిక్షణ కలిగి ప్రతి పౌరుడు విద్య వైద్యం న్యాయం అందరికీ సమానంగా అందే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్ గురుస్వామి నాయుడు లైన్ దొరస్వామి నాయుడు కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
