తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో అంబేద్కర్ భవనం ఆధ్వర్యంలో భవనం సభ్యులు మనుధర్మ శాస్త్రాన్ని బుధవారం మండల కేంద్రంలో దహనం చేశారు. ఈ సందర్భంగా పాకాల అంబేద్కర్ భవన్ ప్రధాన కార్యదర్శి గణేష్ మాట్లాడుతూ అంటరానితనాన్ని అక్రమాలకు, అణిచివేతలకు ప్రతీక మనధర్మశాస్త్రం అన్నారు. ఈ మనుధర్మ శాస్త్రాన్ని 1927 డిసెంబర్ 25 న కోల్హాభ (రాయగడ్) లో దహనం చేశారన్నారు. వారి వారసులుగా జాతిలో మార్పు వచ్చి చైతన్య వస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో బాబ్జి, ఆది కేశవులు, ప్రభు, విజయ మోహన్ రెడప్ప, జగన్నాథం, రామయ్య, రెడ్డప్ప, జయ బాల, సుధాకర్, వినాయక, శివప్రసాద్, నరసింహులు, వెంకటస్వామి, రామచంద్ర, శ్రీరాములు, ఉదయ్ కిరణ్, రవి, సంపత్, మోహన్, ఆంజనేయులు, జ్యోతి, వెంకటరత్నం, వెంకటస్వామి, రెడ్డప్ప పాల్గొన్నారు
