తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్ లో పాకాల సి.ఐ యం.సుదర్శన్ ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పాకాల సి.ఐ యం.సుదర్శన్ ప్రసాద్ మాట్లాడుతూ మండల ప్రజలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా కోడి పంద్యాలు,జల్లికట్టు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినారు.గతంలో నిర్వహించిన వారిని ముందస్తుగా బైండోవర్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నారు.చట్టం దృష్టిలో అందరూ సమానమేనని,ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అన్నారు.పేకాట ఆడుతున్న,ఆసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని చెప్పారు.సమాచారం తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతారు అని పేర్కొన్నారు.