తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆటో స్టాండ్ వద్ద సిపిఎం అఖిలభారత కార్యదర్శి సీతారాం ఏచూరి చిత్రపటానికి సిఐటియు నాయకులు మధుసూదన్ రావు,కెవిపిఎస్ మండల నాయకులు,ఆటో యూనియన్ నాయకులు కలిసి పూలమాలవేసి శుక్రవారం ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ సిపిఎం అఖిలభారత కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం దేశానికి,అభ్యుదయ ఉద్యమానికి,వామపక్షాలకు,తీరని లోటని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి సంతాపం తెలియజేశామని అన్నారు.ఆయన మృతి,పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం,సిఐటియు,కెవిపిఎస్ నాయకులు,ఆటో యూనియన్ వర్కర్లు పాల్గొన్నారు.