తిరుపతి జిల్లాలోని పాకాల సబ్ రిజిస్టర్ కార్యాలయం పూర్తిగా దళారుల చేతుల్లోకి వెళ్ళింది. భూ దాహానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ప్రభుత్వం మారినా వైసీపీ నాయకుల పనితీరు మారడం లేదు. చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలం గంటా వారి పల్లిలో శ్రీపురం దామోదర్ రెడ్డి కి సంబంధించిన భూ వివాదం చోటుచేసుకుంది. సర్వే నెంబర్ 513/16 లోని 66 సెంట్ల భూమి, దామోదర్ రెడ్డికి సుమారు 40 సంత్సరాల నుండి అనుభవంలో ఉంది. అయితే పుల్లారెడ్డి మరియు అతని వారసులు అలాగే రెవిన్యూ దళారీ హేమ శేఖర్ కలిసి వైసీపీ నాయకులను అడ్డం పెట్టుకొని తప్పుడు దస్తావేజులను సబ్ రిజిస్టర్ అధికారులతో ప్రమేయం లేకుండా సృష్టించి, తమ భూమిని ఆక్రమించుకున్నారంటూ బాదితుడు ఆరోపిస్తున్నాడు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.