తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం సామిరెడ్డి పల్లి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పాకాల చెరువు కి మొరవ లేనట్లే నా? 2021 వ సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకి చెరువు కట్ట తెగిపోతుండడంతో అప్పటి ప్రభుత్వ అధికారులు మొరవని జెసిబిలతో తొలగించి నీటిని వృధాగా పంపించేయడం జరిగినది. చెరువు కట్ట బాగుచేసిన మొరవపని మాత్రం అలానే వదిలేసారు. ఇప్పటికి మూడు సంవత్సరాలు గడుస్తున్న ఏ ప్రభుత్వ అధికారులు ఇంతవరకు పట్టించుకోవడం లేదు. గడిచిన గత ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో మొరవపని అలానే ఉండిపోయింది. అలాగే చెరువు కట్టమీద మొత్తం ముళ్ళపొదలతో నిండిపోయి ఉన్నది. కూటమీ ప్రభుత్వం అయినా మొరవని కట్టించాలనీ స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకి చెరువులోకి నీరు వచ్చిన నిల్వ లేకుండా వంకల్లోకి వెళ్లిపోతున్నాయి. పాకాల చెరువులో నీరు నిల్వ ఉండటం వలన పాకాల టౌన్, సామిరెడ్డిపల్లి, అడుసుపల్లి, చెన్నుగారిపల్లి ,మణిపిరెడ్డి పల్లి, తోటపల్లి, పెద్ద పాకాల, కోనపరెడ్డిపల్లి, బైనపల్లి, కుందేటి వారి పల్లికి అదేవిధంగా దిగువున ఉన్న గ్రామాలన్నింటికీ వ్యవసాయానికి మరియు త్రాగు నీరు ఇబ్బంది లేకుండా దోహదపడుతుంది. కావున తక్షణమే కూటమి ప్రభుత్వమయినా మొరవపని, ముళ్లపొదలు తొలగించే కార్యక్రమం చేపట్టాలని గ్రామస్తులు అందరూ కోరుకుంటున్నారు.