చిత్తూరు జిల్లా: శారీరక మానసిక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసానికి మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేర్ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో గురువారం ఆయన వీకే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందిన పలువురు చిన్నారులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రస్తుత సమాజంలో క్రీడలతోపాటు మార్షల్ ఆర్ట్స్ వై ప్రతి ఒక్కరు దృష్టి సారించాలన్నారు. ప్రధానంగా ఆడపిల్లలకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు చిన్నప్పటి నుంచే మార్షల్ ఆర్ట్స్ పై మక్కువ పెరిగేలా చూడాలని తద్వారా వారికి ఆరోగ్యంతో పాటు పలు అంశాలలో అవకాశాలు లభించేందుకు వీలుంతుందన్నారు. ఈ సందర్భంగా అకడమీ నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు పలమనేరు బాలాజీ కో-ఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్ వి బాలాజీ, ఆర్ బి సి కుట్టి, గిరిబాబు, ఖాజా, నాగరాజు, మదన్, కిరణ్, శ్రీధర్, రమేష్,సురేష్ సుధాకర్, మోహన్, రామూర్తి తదితరులు పాల్గొన్నారు.
