రీంనగర్ జిల్లా : పల్లె పల్లె కు కవ్వంపల్లి గడప గడప కు కాంగ్రెస్ అనే నినాదంతో డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ సారథ్యంలో కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్ల లక్ష్మి గణపతి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ గడిచిన 8 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా మొండి వైఖరితో ప్రవర్తిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉచిత ఇందరమ్మ ఇళ్లు, ఫీజు రియంబర్స్మెంట్, 108, ఏకపక్షంలో రుణమాఫీ తదితర కార్యక్రమాలు చేపట్టిందన్నారు. స్థానికేతరుడైన రసమయి రెండు గఫాలు గెలిచిన అభివృద్ధి గాడిన పెట్టాడని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలు చేతిని నమ్మాలని విజ్ఞప్తి చేశారు వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే పేదలకు అండగా నిలుస్తామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చిట్కారి అనంతరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ముల్కల మల్లేశం, బ్లాక్ కాంగ్రెస్ మానకొండూరు నియోజవర్గ అధ్యక్షుడు కోమ్మర రవీందర్ రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మాతంగి అనిల్,గ్రామ శాఖ అధ్యక్షుడు ఈగ రాజయ్య, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు.