కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 14 తేదీ నుండి 16 తేదీ వరకు గన్నేరువరం మండల పరిషత్ కార్యాలయంలో పారిశుధ్యం పై గౌరవ సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు, వివోఏలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి శిక్షణ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ప్రారంభించినారు.
శిక్షణలో మరుగుదొడ్ల నిరంతర వాడకం, చెత్త చెదారం సక్రమ నిర్వహణ, మురికి నీటి నిర్వహణపై వివరంగా తెలియజేశారు.
రెండవ రోజున 15 తేదీన ఫీల్డ్ విసిట్లో భాగంగా మండలంలోని ఖాసీంపేట గ్రామాన్ని శిక్షణ తీసుకునేవారు సందర్శించి గ్రామంలో గ్రామ పారిశుద్ధ్య ప్రణాళిక తయారు చేస్తారు.
ఈ శిక్షణను స్వచ్ఛభారత్ జిల్లా కోఆర్డినేటర్లు టి. రమేష్, కే. వేణు ప్రసాద్, కే శ్రీధర్ లు మాస్టర్ ట్రైనర్స్ గా శిక్షణ అందిస్తూన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో ఎంపీడీవో పివి నరసింహారెడ్డి, యూనిసెఫ్ క్లస్టర్ ఫెసిలిటేటర్ చేన్నబోయిన రవీందర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ఏపీఎం,ఏఈ, ఆర్డబ్ల్యూఎస్, అంగన్వాడి సూపర్వైజర్, అగ్రికల్చర్, హెల్త్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లు, వివోఏలు, తదితరులు పాల్గొన్నారు.