పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా మల్లిక గార్గ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూజిల్లాలో పోలింగ్ రోజున, పోలింగ్ తర్వాత జరిగిన సంఘటనలను సమీక్షించి శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావడమే ప్రధమ బాధ్యత,ఓట్ల లెక్కింపు ప్రక్రియ ను సజావుగా జరిగేలా చూస్తామన్నారు.
ఎలక్షన్ నేరాలకు సంబంధించిన ముద్దాయిలను గుర్తించి వారి అరెస్టులు త్వరితగతిన పూర్తి చేస్తాము.సమస్యాత్మక వ్యక్తులు అల్లర్లు సృష్టించే అసాంఘిక శక్తులపైన , సమస్యాత్మక గ్రామాల పైన ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తున్నామని, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారు ఎంతటి వారైనా సహించేది లేదు వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి. జిల్లాలో 144 సెక్షన్ ని గట్టిగా అమలు చేస్తాము దీనికి ప్రజలందరూ సహకరించాలని తెలిపారు.
దేశంలో ఆంధ్రప్రదేశ్ కు అందులో పల్నాడు జిల్లా కు మంచి పేరు ఉందని చెదురు మదురు సంఘటనల వల్ల ఆ పేరు చెడిపోకూడదని మళ్ళీ తిరిగి జిల్లా యొక్క కీర్తి ప్రతిష్టలు నిలబెట్టడానికి ప్రజాప్రతినిధులు,ప్రజలు, మీడియా పోలీసులకు సహకరించి జిల్లాలో లా అండ్ ఆర్డర్ అదుపులోకి తీసుకురావడానికి సహాయపడాలని దీనిని అందరూ బాధ్యతగా స్వీకరించాలని కోరారు.
నరసరావుపేట డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎం.సుధాకర్ రావు..
కారంపూడి ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన అమీర్