పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో మద్యం అమ్మకాలు అడ్డగోలుగా సాగుతున్నాయి. వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయా లు జరుపుతూ అందినకాడికి దండుకుంటున్నారు. వైన్స్ లా వ్యవహరిస్తున్న బార్లు .. లూజు మద్యం కల్తీ విక్రయాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాపారుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. పిడుగురాళ్ళ పట్టణంలో గల వెంకట్రామ బార్ అండ్ రెస్టారెంట్ లో మార్చి నెలలోనే కాలం చెల్లిన (ఎక్స్‌పైరీ డేట్) బీర్లను అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అంతేకాక నేడు చేపల మార్కెట్ లో చేపలు అమ్మినట్టు బార్ రూల్స్ ని తుంగలో తొక్కి వైన్ షాప్ లో మద్యం అమ్మినట్టు అడ్డగోలుగా అమ్ముతున్నారు. ఈ రోజు అనగా మే నెల 23 వ తేదీ ఉదయం 8.30 గంటల ప్రాంతంలో వైన్స్ షాప్ లో మద్యం అమ్మినట్టు అడ్డగోలుగా అమ్ముతున్నారు. ఇదంతా ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలిసినా డోంట్‌వర్రీ అమ్మేసుకోండి అంటూ మద్యం వ్యాపారులకు పరోక్షంగా సహకారం అందిస్తున్నార న్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయ మై జిల్లా ఎక్సైజ్‌శాఖ సూపరింటెండెంట్‌ను ఫోన్‌లో వివరణ కోరగా స్పందించ లేదు. మద్యం అక్రమ అమ్మకాలు నిత్యం అధికారుల కళ్ల ముందే జరుపుతున్నా.. మాముళ్ల మత్తులో అధికారులు కళ్లు మూసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచి లూజు విక్రయాలను జరుపుతున్నారు. కానీ . అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. నిబంధనల అమలుపై పట్టింపే లేదు. నెలవారి మాముళ్లకు ఆశపడి అటువైపు కన్నెత్తైన చూడడం లేదు అధికారులు. జిల్లా అధికారి స్థానికంగా ఉండకపోవడంతో మద్యం అక్రమ విక్రయాలపై పర్యవేక్షణ కొరవడుతోంది. ఏదో ఇలా వచ్చి అలా వెళ్తున్నారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాలి.