రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పేర్ల మార్పును స్వాగతిస్తున్నాం. ఎం హెచ్ పి స్ సంక్షేమ పథకాల పేర్ల మార్పుపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు మైనార్టీ పరిరక్షణ సమితి గురజాల నియోజకవర్గ అధ్యక్షులు షేక్ సైదా వలి, ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ పేర్కొన్నారు. చరిత్ర కారుల మరియు గొప్ప మహోన్నత వ్యక్తుల పేర్లను సంక్షేమ పథకాలకు పెట్టడం హర్షనీయమని కొనియాడారు. జగనన్న అమ్మ ఒడిని – తల్లికి వందనంగా, నాడు నేడు ను – మన భవిష్యత్తుగా, జగనన్న విద్యా కానుకను – సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థిమిత్రగా, జగనన్న గోరుముద్దను – డొక్కా సీతమ్మ మధ్యాహ్నబడి భోజనం గా, స్వేచ్ఛ ను – బాలకా రక్షణ గా, జగనన్న ఆణిముత్యాలను – అబ్దుల్ కలాం ప్రతిభా పునస్కారంగా మార్పులు చేయడం హర్షనీయం.