పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండల కేంద్రం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పల్నాటి ప్రభ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవ్ గర్ల్ కార్యక్రమం మంగళవారం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తహసీల్దార్ అశృపున్నిషా బేగం హాజరు అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ఆడపిల్లలు సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే చదువు అనేది ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. బాధ్యతగా ఉండాలని అనవసర విషయాల జోలికి వెళ్ళకూడదు అన్నారు. మాట్లాడే విధానం చాలా జాగ్రత్త గా ఉండాలని పేర్కొన్నారు. అనంతరం ఏవో కృష్ణయ్య మాట్లాడుతూ సమాజంలో మహిళలపై ఎన్నో దాడులు జరుగుతున్నాయని వాటిని అరికట్టే క్రమంలోని అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాలని పేర్కొన్నారు. అలానే కార్యక్రమంలో ఎంఈఓ బాలసుందర్రావు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా క్లుప్తంగా వివరించారు. అనంతరం ఉపాధి హామీ పథకం ఏపీఓ కోటమ్మ మాట్లాడుతూ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రతి అంశం గురించి మాట్లాడుతూ సమాజంలో ఎలా మెలగాలి ఎలా ఉండాలి మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో విద్యార్థులకు వివరించారు. జనసేన పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ మునగా వెంకట్ మాట్లాడుతూ సోషల్ మీడియా వల్ల కలిగే నష్టాలు గురించి వివరించారు. సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటుందని సోషల్ మీడియాకు కనెక్ట్ అయి విద్యార్థులు ఇబ్బందులు పడొద్దు అన్నారు. సర్పంచ్ సముద్రం మాట్లాడుతూ సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలన్నారు సెల్ఫోన్ వల్ల ఎన్నో అనార్ధాలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తమ పిల్లల పట్ల జాగ్రత్తలు పాటిస్తూ సెల్ఫోన్ కు పిల్లలు దూరంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మహిళా పోలీసులు మౌనిక మరియు శాంతి తమ తమ సందేశాలను తెలియజేశారు. అలానే ఫౌండేషన్ నిర్వాహకులు ఉంగరాల కార్తీక్ మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించి సోషల్ మీడియా సంరక్షణ బాధ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో చండ్రాజు పాలెం ప్రభుత్వ వైద్యులు అంసుధర్, ఆర్ ఐ, పవన్, జిల్లా టిడిపి నాయుకులు మాజీ సర్పంచ్ మస్తాన్ షరీప్, సెక్రెట్రి శ్రీనివాస్, వీఆర్వో వెంకయ్య, మహిళా పోలీస్ లు షేఖ్ మహబూబి, రిహన, ఫాతీమున్నిస, పాఠశాల సిబ్బంది విద్యార్థులు పలువురు, పాల్గొన్నారు.