పల్నాడు / పెదకూరపాడు : పదోన్నతి సమస్యను పరిష్కరించాలని కోరుతూ 1992 సర్వీస్ కమిషన్ బ్యాచ్ కు చెందిన ఆర్ డబ్ల్యు ఎస్ మరియు ఎస్ డిపార్ట్మెంట్ జోన్ 3 డిఈఈ లు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ని కలిశారు. నవభారత్ నగర్ లోని ఎమ్మెల్యే ప్రవీణ్ కార్యాలయంలో జాన్3 డిఈఈ లు ఆయనను కలిసి తమ సమస్యలను విన్నవించారు. 2008 నుండి తమ ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. 1997 సర్వీస్ కమిషన్ బ్యాచ్ మరియు 1990-95 తాత్కాలిక బ్యాచ్ కు చెందిన అధికారులు జీవో నెంబర్ 71 కింద పదోన్నతులు పొందుతున్నారన్నారు. దీంతో 1992 బ్యాచ్ డీఈఈ లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం గ్రామీణ నీటి సరఫరా శాఖ సమీకృత సీనియారిటీ జాబితాలో 1992 బ్యాచ్ అధికారులకు పదోన్నతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ కృష్ణ తేజ గారికి ఉద్యోగులకు పదోన్నతి సమస్యను పరిష్కరించాలని కోరుతూ లేఖ రాశారు. ఉద్యోగులకు న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని ఉద్యోగులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డిఈఈ లు శంకర్ బాబు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.