పల్నాడు జిల్లా/ అచ్చంపేట: పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు వద్ద గల ఇసుక స్టాక్ పాయింట్ ను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మరియు జిల్లా ఎస్ పి కంచి శ్రీనివాసరావు బుధవారం ఉదయం ఆకస్మిక తనిఖి చేసారు. స్తాక్ పాయింట్ వద్ద పరిశీలనా అనంతరం అక్కడి సిబ్బందికి తగు సూచనలు ,సలహాలు అందచేశారు. అనంతరం పాత్రికేయలతో మాట్లాడుతూ మాదిపాడు వద్ద ఉన్న స్టాక్ పాయింట్ నిర్వహణ ఎలా ఉంది అని ఈ రోజు సందర్శించటం జరిగిందన్నారు. స్టాక్ పాయింట్ వద్ద ముదస్తూ బిల్లులు లేకుండా లోడింగ్ చేయడం జరుగదని, అనుమతి లేని వాహనాలు స్తాక్ పాయింటి వద్ద ఉండకూడదన్నారు. సీరియల్ ప్రకారం లోడింగ్ చేయాలనీ లోకల్ ప్రయార్ట్ అని రూల్స్ కు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళపై కేసు ఫైల్ చేయమని పోలీస్ వారికీ ఇంస్ట్రుక్షన్స్ ఇవ్వటం జరిగిందన్నారు.. సచివాలయం లో బిల్ పేమెంట్ చేసి లోడింగ్ పాయింట్ కీ రావాలని వాహనదారులకు సూచించారు. సచివాలయం లో బిల్లులు కాకుండా ఎటువంటి లోకల్ స్లిప్స్ తో లోడింగ్ జరిగిన వారిపై డిపార్ట్మెంట్ పరమైన చెర్యలు ఉంటాయన్నారు. జిల్లాలో ఇసుక కొరత లేదని, కొత్తగా డీ-సిల్టింగ్ పాయింట్లను గుర్తించడము జరిగిందన్నారు. అక్రమంగా ఇసుకను డంప్ చేసి బ్లాక్ మార్కెట్లో అమ్మకం నిషేదమని అలా ఎవారైనా అక్రమాలకూ పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.ఇసుక తరలింపు లో అవకతవకలు లేకుండా సారిన కొలతలతో పైన టార్పాలిన్ తో కవర్ చసి తరలించాలన్నారు. జిల్లా ఎస్పీ శ్రీ. కే.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇసుక పాయింట్ లవద్ద ప్రత్యెక టీములు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పాయింట్ వద్ద క్యూ లైన్ పద్దతి, అక్రమ ఇసుక రవాణా నిరోదించే ప్రక్రియను పరిశీలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమకులో రెవిన్యూ డివిజినల అధికారి మురళి, భూగర్బ,గనుల శాఖ సహాయ సంచాలకులు నాగిని, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.