అమరావతి : ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను శాసనమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. నామినేటెడ్ పదవుల భర్తీలలో భాగంగా చర్చ జరుగుతుందని విశ్వసనీయ సమాచారం. జంగా వైసీపీని వీడి తెలుగుదేశం విజయానికి కృషి చేశారు . ముఖ్యమంత్రి ని కలిసిన వారిలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు తోపాటు గురజాల శాసనసభ్యులు యరపతినేని కూడా ఉన్నారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.