పాలన పల్నాడు జిల్లా : జిల్లాలో రెండ్రోజులు గా కురుస్తున్న వర్షానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు శనివారం తెలిపారు. సహాయ చర్యలకు కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని , ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే ఈ ఫోన్ నంబర్లకి 08647-252999, 9154959292 ఫోన్ చేసినట్లయితే సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.