పల్నాడు జిల్లా మాచవరం: తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ కృష్ణానది వెంబడి ఉన్న మొర్జంపాడు గ్రామ పరిధిలో అక్రమ మద్యం తరలిస్తున్నారన్న సమాచారంతో మాచవరం మారు వేషాలలో వెళ్ళి పట్టుకున్నారు. గురువారం రాత్రి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తుల వద్ద ఉన్న 430 మద్యం బాటిల్స్ ను, రవాణాకు ఉపయోగించిన కారు మరియు మోటార్ బైక్ ను స్వాధీన పరుచుకుని సంబంధిత అధికారులకు, మీడియాకు తెలియపరచడం జరిగింది. పట్టుబడిన మద్యం విలువ సుమారు 58,000 ఉంటుందని ఎస్సై కె సతీష్ తెలిపారు. పొరుగు రాష్ట్రాల నుండి మద్యాన్ని తీసుకువచ్చినా, నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై పేర్కొన్నారు.