పల్నాడు జిల్లా / ఒప్పిచర్ల : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఒప్పిచర్ల గ్రామ పంచాయతీ సుమారు 8 వేలు పై చిలుకు ఓటర్లు ఉన్న ఈ పంచాయతీ డ్రైనేజ్ హబ్ గా మారింది. మాములుగానే మురుగు ఎక్కడక్కడ నీల్వ ఉంటుంది. వర్షం పడితే ఇంకా అంతే సంగతులు కనీసం ప్రజలు నడవడానికి కుడా దారి ఉండని పరిస్థితి కనిపిస్తుంది. గురజాల వెళ్లే రహదారి పక్కన ఎస్.సి కాలని ఉంది. రహదారి పక్కన ఒకవైపు డంప్ మరొక వైపు నీరు నీల్వ ఉండి కాలనీ వాసులకు దారి కుడా ఉండదు, వాహదారులు కుడా తీవ్రమైన ఇబ్బందిగా ఉంటుంది. గ్రామంలో విపరీతంగా డయేరియా ప్రబలుతున్న గాని, మురుగు నీరు, చెత్త, మొత్తం ఇక్కడ చేరి ఉన్న గాని దీని గురించి ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ కన్నెత్తికూడా చూడటం లేదు.మా వైపు చూడండి మహాప్రభు అంటూ కాలనీవాసులు మోరపెట్టుకున్న కానీ వారి మోర ఆలకించే నాధుడు లేడు అంటూ వారు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. గ్రామంలో డయేరియా ఉన్న కాలనీ లో మురుగు కాలువలు తియ్యడం కానీ, బ్లీచింగ్ చల్లడం గాని చెయ్యలేదు, అంటూ కాలనీవాసులు వాపోతున్నారు. ఈప్పటికైనా ఉన్నతాధికారులు దీనిపై చర్యలు తీసుకుని ఈ సమస్య కు సత్వర పరిస్కారం చూపాలని వారు కోరుకుంటున్నారు.