పల్నాడు జిల్లా అమరావతి: అమరావతి మండలంలోని పెద్దమద్దూరు, ఎండ్రాయి, చావపాడు గ్రామాల్లోని పలు కాలనీలో మంగళవారం పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పర్యటించి, వరద బాధితులను పరామర్శించడం జరిగింద ఆయన దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి పంట నష్టపోయిన రైతులను అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు భరోసా ఇచ్చారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ..
గత మూడు రోజులుగా వరద నీటిలోనే లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వరదలు తగ్గుముఖం పట్టడం రైతులకు కాస్త ఊరటం ఇస్తుందన్నారు.. వరదల్లో నష్టపోయిన బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గత మూడు రోజులుగా నిరంతరం శ్రమిస్తూ ప్రతి అవకాశాన్ని వినియోగిస్తూ సహాయక చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే వివరించారు. ప్రతి ఒక్కరు మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేలా కూటమి నాయకులు, అధికారుల సమన్వయంతో పని పనిచేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఏలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని , వరదకు గురైన ముంపు ప్రాంతాల్లో తక్షణమే వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే ప్రవీణ్.