పల్నాడు జిల్లా : జిల్లా ముస్లిం మైనారిటీ నాయకులు ఎంపీ లావు కృష్ణదేవరాయలను మర్యాదపూర్వకంగా కలిసి మీలాద్ ఉన్ నాబీ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. అనంతరం “మన ప్రవక్త” అనే శీర్షిక అందజేశారు. ఇటీవల నూతనంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ముస్లిం మైనార్టీల వక్ఫ్ ఆస్తుల సవరణ బిల్లు చట్టం పై చర్చించారు.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా టీడిపి మైనార్టీ విభాగ అధ్యక్షులు సయ్యద్ అమీర్ అలీ, గురజాల నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్లా ఆఫీ సాబ్, నరసరావుపేట నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు షేక్ మాభు, జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు షేక్ సైదా వలి, జిల్లా మీడియా కోఆర్డినేటర్ షేక్ ఖలీల్, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి పల్నాడు అధ్యక్షులు షేక్ సైదా వలి బుడే తో పాటు ఎంపిజే సుభాని, షేక్ ఖాసీంషరీఫ్, సయ్యద్ ఖలీల్, షేక్ సైదా, అబ్దుల్లా పాల్గొన్నారు.