contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ప్రజా సమస్యల పరిష్కార వేదిక : పల్నాడు ఎస్పీ

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఐపీఎస్ . ఈ స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 89 ఫిర్యాదులు అందాయి.
★ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని  ఎస్పీ  సూచించారు.
★ నరసరావు పేట కు చెందిన అడ్డగిరి రామ విజయ్ కుమార్ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పని చేస్తూ ఈపూరు మండలం బొగ్గారం గ్రామానికి చెందిన వేమా ఏడుకొండలు వద్ద 34,00,000 రూపాయలు తీసుకుని డబ్బులు ఇవ్వలేక తన వద్ద ఉన్న ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసినట్లు, అయినను వేమన ఏడుకొండలు పదిమంది రౌడీ మూకలను తీసుకొచ్చి ఇబ్బంది పెట్టినందుకు గాను ఎస్పీ కి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
   ★ రాజుపాలెం మండలం నెమలిపురి గ్రామానికి చెందిన కాట్రగుంట అనంతమ్మ  యొక్క ఆస్తిని తన రెండవ కుమార్తె అయిన లక్ష్మి మరియు తన కొడుకు అయిన కాట్రగుంట వెంకటేశ్వర్లు తనకు తెలియకుండా మూడు ఎకరాల పొలమునకు సంబంధించి ప్రభుత్వం వారు డబ్బులు వేస్తున్నారని మోసం చేసి తన చేత సంతకం చేయించుకుని వారి పేర్ల మీద నమోదు చేసుకున్నట్లు, నిన్న రైతు భరోసా డబ్బులు పడినయో లేదో తెలుసుకొనుటకు గాను వారి ఊరి పంచాయతీకి వెళ్లి అడగగా అది తన ఆధీనంలో లేదని చెప్పగా, ఆ పొలం తన కొడుకు పేరు మీద మరియు తన రెండవ కుమార్తె పేరు మీద ఎక్కించుకున్నారని తెలిసి వారిని అడుగినట్లు, వాళ్ళు ఆమె దగ్గర ఉన్న 30 వేల రూపాయల నగదు, ఐదు సవర్ల కాశి కాయల బంగారు దండను బలవంతంగా లాక్కొని ఇంటి నుంచి గెంటి వేసినట్లు మరల అక్కడ కనబడితే చంపుతామని బెదిరించినట్లు ఫిర్యాదు చేసినారు.
★ నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన కొల్లా సుబ్బారావు కు చెందిన ఆరు ఎకరాల భూమిని YCP కు చెందిన నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు అతని అనుచరులు కొంతమంది కలిసి ఫిర్యాదుని మానసికంగా శారీరకంగా హింసించినందుకు ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేసినారు.
    ★ నరసరావుపేట మండలం లింగంగుంట్ల అగ్రహారం గ్రామ నివాసి అయిన పొన్నపాటి సీతారామరెడ్డి కు పోలవరం ప్రాజెక్టు నందు ఉద్యోగం ఇస్తామని మెడంపూడి వెంకటేశ్వర్లు 22 లక్షల వరకు డబ్బులు తీసుకున్నట్లు, ఉద్యోగం ఇప్పించకపోవడంతో  డబ్బులు ఇవ్వమని అడగగా డబ్బులు అడిగావంటే నిన్ను నీ కుటుంబాన్ని నరికి ఈ భూమి మీద లేకుండా చేస్తానని బెదిరించినట్లు  ఫిర్యాదు చేసినారు.
     ★ చిలకలూరిపేట పట్టణ గ్రామ కాపురస్తురాలు అయిన అన్నపురెడ్డి ప్రసన్న యొక్క భర్త అయిన యోగేశ్వరరావు కుటుంబ అవసరాల కొరకు బంధన బ్యాంకు నందు లోన్ తీసుకొని నెల నెలా సక్రమంగా కడుతున్నట్లు, ఈనెల వారి ఆర్థిక పరిస్థితి బాగోలేక కట్టలేకపోయినట్లు, దానికి గాను వచ్చే నెలలో కడతామని బ్యాంకు వారికి చెప్పగా వినకుండా బ్యాంకు వారు ఫిర్యాది ఇంటి తాళం పగలకొట్టినట్లు, కావున ఇబ్బందికి గురి చేసిన బంధన్ బ్యాంకు వారిని, వారికి సపోర్టుగా ఉన్న పల్లపు వీరస్వామి కళ్యాణి వారి కుటుంబ సభ్యులు మొత్తం తన కుటుంబం మీద దాడికి దిగగా ఫిర్యాది తల్లికి స్వల్ప గాయమైనట్లు కావున సదరు బ్యాంకు వారి మీద మరియు దాడి చేసిన వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేయడం జరిగింది.
       ★ ఈపూరు మండలం ఇనుమెళ్ళ గ్రామానికి చెందిన దూళ్ళ శ్రీ లక్ష్మికి సుమారు నాలుగు సంవత్సరాల క్రితం వాహమైనట్లు, ఆమెకు ఒక పాప సంతానం ఉన్నట్లు అంతట ఫిర్యాదు భర్త ఆయన దూళ్ల నాగేశ్వరరావు అనుమానంతో తనను తన పుట్టింట్లో వదిలిపెట్టి ప్రస్తుతం దూళ్ళ నాగేశ్వరరావు ఒక నెల క్రితం వేరొక వివాహం చేసుకున్నాడని తెలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
       ★  కారంపూడి మండలం కారంపూడి గ్రామానికి చెందిన పలుశెట్టి ఆంజనేయులు అను అతను సుమారు మూడు నెలల క్రితం తన స్నేహితులతో కలిసి బయటికి వెళ్లినట్లు ఇంత వరకు ఇంటికి రానందున తన భార్య అయిన పలిశెట్టి పద్మావతికి అతను ఏమయ్యాడు అని అనుమానం కలిగి తన భర్త ఆచూకీ కనుగొనవల్సిందిగా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
   ★ నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన సంపేట కోటేశ్వరరావు అను అతను తనకు తెలిసిన వ్యక్తి అయిన B. సురేంద్ర అను అతను ఆన్ లైన్ లో లోను ఇప్పిస్తానని 88,686/- లు ఫిర్యాది ఖాతాకు పంపినట్లు ఫిర్యాదు నేను వడ్డీ కట్టలేనని ఈ డబ్బు మరల కంపెనీకి పంపించమని సురేంద్రకు చెప్పగా సురేంద్ర తన భార్య అకౌంటుకు పంపించుకొని కిస్తీలు కట్టకుండా ఇబ్బంది పెడుతున్నందుకు చట్టపరమైన చర్య తీసుకొనవలసిందిగా ఫిర్యాదు చేయడం జరిగింది.
★ నరసరావుపేట మండలం జగనన్న కాలనీ, ఉప్పలపాడు గ్రామానికి చెందిన కందుల నాగవని ఇంటి ప్రక్కన మధు,బాజి, యశోద మరి కొంత మంది వ్యభిచారం, గంజాయి అమ్ముతూ, అడుగుతున్న వారిపై తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నందుకు ఫిర్యాదు చేయడం జరిగింది.
★ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసిపెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందించారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకు దాతలు అన్నదానం ఏర్పాటు చేసినారు
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :